హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేకు ఉప్పర సంఘం నాయకుల వినతి

ఆదిలాబాద్ జిల్లా సగర (ఉప్పర) సంఘం ప్రతినిధులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను బుధవారం కలిసి తమ సామాజిక వర్గ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రిజర్వేషన్లు, సామాజిక న్యాయం, విద్య, ఉద్యోగ అవకాశాలపై చట్టబద్ధంగా న్యాయం జరిగేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు పేర్కొన్నారు.