హైదరాబాద్: 28°C
తెలంగాణ

శంకుస్థాపనకే పరిమితమైన రహదారి పనులు

SRPT: అనంతగిరి మండలం ఖానాపురం నుంచి వెంకటాపురం, గోలేండా మీదుగా వెళ్లే రహదారి నిర్మాణ పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రూ.1.42 కోట్ల నిధులతో 2025 జనవరి 10న ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి శంకుస్థాపన చేశారు. నెలలు గడుస్తున్నా పనులు మొదలుకాలేదని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి వెంటనే పనులు చేపట్టాలని కోరుతున్నారు.