హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి ధరల భారం

GDWL: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి ధరలు గుదిబండగా మారాయి. ఎర్రవల్లి మండల కేంద్రంలో సిమెంట్, స్టీల్ వ్యాపారులు తూకాల్లో మోసాలు చేస్తూ, తెల్ల పేపర్లపై బిల్లులు ఇస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. పెరిగిన కూలీ, రవాణా ఖర్చులతో ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.