హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూడు రోజుల్లో ముగ్గురు పోలీసులపై వేటు

SRPT: సూర్యాపేట జిల్లాలో మూడు రోజుల్లోనే ముగ్గురు పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. వాహనాల తనిఖీల పేరుతో ఫోన్‌పే ద్వారా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై ఇద్దరు కానిస్టేబుళ్లు, బుల్లెట్ బైక్ మాయమైన వ్యవహారంలో హుజూర్‌నగర్ ఎస్సై సస్పెండ్ అయ్యారు. ఈ వరుస చర్యలు పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారాయి.