NZB: ప్రసిద్ధ నీలకంఠేశ్వర ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి మరుసటి రోజు శివయ్యను దర్శించుకోవడం తమ కుటుంబ ఆచారమని తెలిపారు. ఆలయ పరిసరాల శుభ్రత కోసం కృషి చేస్తున్న హిందూ సంఘాలను ఆమె అభినందించారు.
తెలంగాణ
నీలకంఠేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా: కవిత


