హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగిసిన ఎన్నికల ప్రచారం

E.G: తాళ్లపూడి మండలంలో పంచాయతీల ఎన్నికల ప్రచారాలు మంగళవారం సాయంత్రంతో ముగిశాయి. 11 పంచాయతీల పరిధిలో 40 మంది సర్పంచి అభ్యర్థులు బరిలో ఉండడంతో పోటాపోటీగా ప్రచారాలు నిర్వహించారు. పోలింగ్‌కు ఒక్క రోజే సమయం ఉండటంతో ఇతర ప్రాంతాల్లోని వలస ఓటర్లపై దృష్టిసారించారు. ప్రతి గ్రామంలో ఇతర ప్రాంతాల్లో ఉపాధి నిమిత్తం కూలీలుగా, బంధువుల ఇళ్లకు వెళ్లినవారిని లెక్కలు కడుతున్నారు.