హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరు వద్ద పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి పాడేరు, కె.కోటపాడు మీదుగా తమిళనాడుకు తరలిస్తున్న 310 కిలోల గంజాయితో పాటు అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న రెండు వాహనాలను సీజ్ చేశారు. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన ముగ్గురు గంజాయి ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.