హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శివనామస్మరణలతో మారుమోగిన మల్లన్న క్షేత్రం

నంద్యాల: శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయంలో ముందుగా జ్వాలాతోరణ మహోత్సవం నిర్వహించగా, ఆలయం ప్రాంగణమంతా శివనామస్మరణలతో మారుమోగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఇక్కడ స్వామివారు మల్లికార్జున స్వామిగా, అమ్మవారు భ్రమరాంబా దేవిగా కొలువై, పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా పూజలందుకుంటున్న సంగతి తెలిసిందే.