హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళతో అసభ్య ప్రవర్తన.. చివరికి..!

ఏలూరు: గృహిణి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి తిరువూరు కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. చాట్రాయి గ్రామానికి చెందిన స్వప్న, రాంబాబు మధ్య 2022 జూన్ 6న డ్రైనేజీ గోడ విషయంలో వివాదం తలెత్తింది. ఆగ్రహంతో రాంబాబు ఆమెపై దాడి చేసి దూషించాడు. విచారణ అనంతరం మేజిస్ట్రేట్ రాంబాబుకు శిక్ష ఖరారు చేసినట్లు SI డి.రామకృష్ణ మంగళవారం తెలిపారు.