హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు వలస వచ్చిన అరుదైన విదేశీ పక్షులు

ATP: ఐరోపా, మధ్య ఆసియా ప్రాంతాల నుంచి వేల కి.మీ. వలస వచ్చే అరుదైన విదేశీ పక్షులు ‘వైట్‌ స్టోర్క్స్‌’ జిల్లాలో కనువిందు చేస్తున్నాయి. అనంతపురం గ్రామీణ మండలం కాట్నే కాలువ పరిసరాల్లో 5 రోజుల కిందట అరుదైన ఈజిప్షియన్‌ రాబందు కనిపించగా, దాని వీక్షణకు బయో డైవర్సిటీ క్లబ్‌ సభ్యులు తరలివెళ్లారు. ఆ క్రమంలోనే నాలుగు వైట్‌ స్టోర్క్స్‌ను గుర్తించారు.