హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

21 సర్పంచ్ స్థానాల్లో 57 మంది పోటీ

AKP: పాయకరావుపేట మండలంలో ఈనెల 29న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో 21 సర్పంచ్ స్థానాలకు 57 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే 264 వార్డు స్థానాల్లో 482 మంది బరిలో నిలిచారు. గుంటపల్లి, శ్రీరాంపురం, కేశవరం పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ మూడు పంచాయతీల్లో అన్ని వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి. గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు.