KKD: జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ హబ్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ఈ మేళా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు నైపుణ్యం పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకొని అడ్మిట్ కార్డు పొందాలని, రెజ్యూమ్, సర్టిఫికెట్లతో ఫార్మల్ దుస్తుల్లో హాజరుకావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు జగ్గంపేటలో మెగా జాబ్ మేళా


