హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మీర్జాపురం గ్రామ సర్పంచ్‌ ఏకగ్రీవంగా ఎన్నిక

NDL: కొలిమిగుండ్ల మండలం మీర్జాపురం గ్రామ సర్పంచ్‌గా పీ. నాగరత్నమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపీడీవో కార్యాలయంలో ఆర్వో లక్ష్మీదేవి ఎన్నికైన నాగరత్నమ్మకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పాల్గొన్నారు.