పల్నాడు జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 3400 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. 554 మంది సర్పంచ్ అభ్యర్థులు, 2,846 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు బరిలో నిలిచారు. జిల్లాలోని 12 మండలాల్లో 189 సర్పంచ్, 2,012 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల పరిశీలన అనంతరం ఈ వివరాలను జిల్లా పంచాయతీ అధికారి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
మూడో విడత పంచాయతీ ఎన్నికలకు 3400 నామినేషన్లు


