CTR: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఈవో పెంచకిల కిషోర్ పదవీ కాలాన్ని మరో ఏడాది పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం, దేవదాయశాఖ జీవోను విడుదల చేసింది. 2024 బ్రహ్మోత్సవాల సమయంలో కాణిపాకం ఈవోగా ఆయన ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం ఆయన పదవీ కాలాన్ని 2027 డిసెంబరు 5వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రభుత్వ కార్యదర్శి (ఎఫ్ఎసీ) కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
కాణిపాకం ఈవో పదవీకాలం పొడగింపు


