హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైభవంగా రంగనాథుని పేట ఉత్సవం

NLR: రంగనాయకులపేట శ్రీతల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా రాత్రి పేట ఉత్సవం జరిగింది. ఉభయకర్తలుగా మాడిశెట్టి గురునాథం, సరోజనమ్మ వ్యవహరించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామివారికి పూజలు చేశారు. ఈవో ఆళ్ల శ్రీనివాస రెడ్డి, ఛైర్మన్ లెక్కల వెంకట రెడ్డి, ధర్మకర్తలు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.