హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రత్నంపేటలో బీజేపీ అభ్యర్థి ప్రచారం జోరు

ASR: కొయ్యూరు మండలం రత్నంపేట పంచాయతీలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అరిమెల రాజు ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. రాజేంద్రపాలెం ఎంపీటీసీ ఎం.చక్రారావు, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి డీ.పద్మరాజు, బీసీ మోర్చా మండల అధ్యక్షుడు గాలి దేముడు తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి సర్పంచ్ తో పాటు 8మంది వార్డుల అభ్యర్థులను గెలిపించాలని కోరారు.