హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

SKLM: చల్లవానిపేట ఉపకేంద్రం పరిధిలో నిర్వహణ పనుల కోసం గురువారం విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఈఈ నరసింహకుమార్ తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ ఉండదన్నారు. జలుమూరు, చల్లవానిపేట, తిలారు, దూగాం, రాణా, కరవంజ, గుగ్గిలి, గుండువలస, తాళ్లవలస, రావిపాడు, పాగోడు, వెంకటాపురం, రామచంద్రాపురం గ్రామాలకు సరఫరా ఉండదని, వినియోగదారులు గమనించాలని కోరారు.