SKLM: కాశీబుగ్గ సమీప పద్మనాభపురం వద్ద మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో దివాకర్ (26) మృతి చెందాడని పోలీసులు తెలిపారు. కిడిసింగికి చెందిన ముగ్గురు బైక్‌పై వస్తుండగా ఎదురుగా వచ్చిన ఆటోను తప్పించబోయి బోర్డును ఢీకొన్నారు. దివాకర్ తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మిగిలిన ఇద్దరిని పలాస ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం


