హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డిగ్రీ స్పెషల్ డ్రైవ్ పరీక్షలు వాయిదా'

SKLM: ఎచ్చెర్లలో అంబేద్కర్ విశ్వవిద్యాలయ అనుబంధ డిగ్రీ కళాశాలల స్పెషల్ డ్రైవ్ పరీక్షల్లో కొన్నింటిని వాయిదా వేస్తున్నట్లు డీన్ ఎం. అనురాధ ప్రకటించారు. స్థానిక ఎన్నికల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 19న జరగాల్సిన పరీక్ష డిసెంబర్ 9న, 26న జరగాల్సిన 3, 4 సెమిస్టర్ పరీక్షలు డిసెంబర్ 10న, డిసెంబర్ 2న జరగాల్సిన పరీక్షలు 11న జరుగుతాయని తెలిపారు.