AKP: కార్తీక పౌర్ణమి సందర్భంగా నర్సీపట్నంలో వివిధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మంగళవారం సాయంత్రం మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన జ్వాలాతోరణాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీపాల వెలుగులతో ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆలయాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు


