SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో ఉన్న మంచినీటి ట్యాంకును మంగళవారం శుభ్రపరిచారు. ఈ ట్యాంకుకు అనుసంధానమైన ఐ.జె. నాయుడు కాలనీ, పూజారి పేట, విద్యానగర్, కాలేజీ ఏరియా ప్రాంతాలకు సరఫరా అయ్యే మంచినీరు కొద్దిగా రంగు మారి వచ్చినా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నీటిని యథావిధిగా వినియోగించుకోవచ్చని కమిషనర్ రవి ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'మంచినీరు రంగు మారినా ఆందోళన వద్దు'


