హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొట్టిప్రోలు సర్పంచ్‌గా అనూష రెడ్డి ఏకగ్రీవం

TPT: నాయుడుపేట మండలం గొట్టిప్రోలు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పల్లమాల అనూష రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం సాయంత్రం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమెకు ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. గ్రామ పంచాయతీ పరిధిలోని మొత్తం 10 వార్డులకు చెందిన సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.