హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటనకు భద్రతా ఏర్పాట్లు

TPT: ఈ నెల 26న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడుతో కలిసి ముందస్తు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు.