CTR: పుంగనూరులోని మండల వ్యవసాయ కార్యాలయంలో మంగళవారం PMFBY, RWBCIS పథకాలపై రైతు సేవా కేంద్రాల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పుంగనూరు డివిజన్ పరిధిలోని సోమల, సదుం, చౌడేపల్లి, పుంగనూరు మండలాల సిబ్బంది హాజరయ్యారు. రబీ సీజన్‌లో టమోటా, మామిడి పంటలకు రైతులు బీమా చేయించుకునేలా అవగాహన కల్పించాలని ఏడీ శివకుమార్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు పంటల బీమాపై అవగాహన


