ELR: జిల్లాలో 22ఏ జాబితా నుంచి భూముల తొలగింపునకు గత ఐదు నెలల్లో 571 అర్జీలు రాగా, 237 అర్జీలను ఆమోదించినట్లు కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా లేని 282 దరఖాస్తులను తిరస్కరించామని, మిగిలిన వాటిని నిర్ణీత గడువులో పరిష్కరిస్తామన్నారు. నవంబర్‌లో 18 గ్రామాల్లో 7,799 పట్టాదార్ పాస్‌పుస్తకాలను పంపిణీ చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
22ఏ భూ సమస్యలపై వేగంగా చర్యలు..!


