AKP: ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం గ్రామంలో మంగళవారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. నక్కపల్లి రూరల్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ, పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు భద్రతపై భరోసా కల్పించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు. ఎలాంటి గొడవలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
బంగారమ్మపాలెంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్


