హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువతకు వాలీబాల్ కిట్ అందజేత

ASR: అరకులోయ మండలం పద్మాపురం–2 ఎంపీటీసీ కొర్రా గురు బొండంగూడ గ్రామ యువతకు వాలీబాల్ కిట్ అందజేశారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకుని, క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జన్ని లక్ష్మణ్, మువ్వల లచ్చు, జన్ని దసరాధి, బురిడీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు.