హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపిన కానిస్టేబుళ్లు

PLD: G.O.Ms.No. 158 ప్రకారం సీపీఎస్ (CPS) నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) పరిధిలోకి మార్పు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లిని మర్యాదపూర్వకంగా కలిసి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు మాణిక్యాలరావు, సిబ్బంది పాల్గొన్నారు.