TPT: జిల్లా సమీపంలోని శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆలయ మెట్లు ఎక్కుతుండగా బెంగళూరుకు చెందిన 71 ఏళ్ల సరోజమ్మ ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడటంతో చేయి విరిగింది. వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను రుయా ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
మెట్లు ఎక్కుతుండగా కిందపడ్డ వృద్ధురాలు


