ASF: ఒకే కుటుంబంలో వరుస మరణాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణికి చెందిన గందే సత్యనారాయణ ఈ నెల 19న తల్లిని పరామర్శించి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటికే అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి గందె చిన్న కమలమ్మ కొడుకు మరణవార్తతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఆమె చనిపోయింది.
తెలంగాణ
కొడుకు మరణం తట్టుకోలేక తల్లి కన్నుమూత


