ASR: ముంచంగిపుట్టు ఎస్సై పీ.నాని ఆధ్వర్యంలో మంగళవారం ముంచంగిపుట్టు జంక్షన్లో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనదారుల పత్రాలు, హెల్మెట్ వినియోగాన్ని పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ముమ్మరంగా వాహన తనిఖీలు


