హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

NRPT: ధన్వాడ మండలం మూల తండాలో వివాహిత మౌనిక (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మూడేళ్ల క్రితం బాలు నాయక్‌తో పెళ్లైన నాటి నుంచి అత్తింటి వేధింపులు ఉన్నాయని, తమ కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీరికి ఏడాది పాప ఉంది. ఎస్సై కృష్ణరాజా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.