హైదరాబాద్: 28°C
తెలంగాణ

దీక్షా దివస్‌లో రైతుల సమస్యలపై ఆవేదన

KNR: గంగాధర మండలంలోని కొండనపల్లిలో దీక్షా దివస్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నిర్వహించిన కార్యక్రమంలో గ్రామస్థులు తమ సమస్యలను ఆయనకు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం తమకు ఉపయోగం లేదని, విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరి కోతలు పూర్తయి నెలన్నర గడిచినా ధాన్యం కొనుగోలు చేయడం లేదని, రూ.500 బోనస్ కూడా అందడం లేదని వాపోయారు.