సూర్యపేట: కోదాడ మండలం అడ్లూరు గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడో తరగతి విద్యార్థి షేక్ నాగుల్ (14) మృతి చెందాడు. గుడిబండకు చెందిన నాగుల్, స్నేహితుడితో కలిసి ఈరోజు బైక్పై వెళ్తుండగా, కోదాడ నుంచి మేళ్లచెరువు వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో నాగుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
లారీ ఢీకొని ఏడో తరగతి విద్యార్థి మృతి


