MDK: సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీ పాఠశాలల్లోని విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ మెదక్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. హాస్టళ్లలో నెలకొన్న ఇబ్బందులను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
తెలంగాణ
హాస్టల్ విద్యార్థుల సమస్యలపై పోరుబాట


