హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తు

PPM: ఈ నెల 26న జరగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా, డ్రోన్లు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టామన్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత ప్రచారం, ర్యాలీలు, సభలు నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.