HYD: జైపూర్‌లో నిర్వహించిన ‘స్టార్ మిస్ టీన్ ఇండియా 2026’ జాతీయ స్థాయి అందాల పోటీల్లో HYDకు చెందిన రిషిత పెన్మెత్స ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా 31 మంది పోటీపడగా రిషిత ఈ ఘనత సాధించింది. తెలుగు అమ్మాయిగా ఈ విజయం సాధించడం గర్వంగా ఉందని ఆమె తెలిపింది. త్వరలో జరిగే అంతర్జాతీయ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు వెల్లడించింది.
తెలంగాణ
అందాల పోటీల్లో రిషిత పెన్మెత్స ఘనత


