హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలి: కలెక్టర్

NGKL: ఈ నెల 26న పదర మండలం మద్దిమడుగులో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ శంకుస్థాపన, ఆంజనేయస్వామి దర్శనం, గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమాల నేపథ్యంలో హెలిప్యాడ్‌తో పాటు ఇతర ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు.