హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర

పల్నాడు జిల్లాగురవాయిపాలెంలో పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తనిఖీ చేశారు. ఈ నెల 26న జరగనున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రాల్లో తాగునీరు,విద్యుత్, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.