హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైక్‌ను ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు

CTR: సదుం మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. పాకాల మండలానికి చెందిన లేగత్ (32) బైక్‌పై పుంగనూరు వైపు వెళ్తుండగా పీపుల్స్ గ్రో స్కూల్ మలుపు వద్ద ఎదురుగా వచ్చిన కర్ణాటక ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.