హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బస్సుల కొరతతో ఇక్కట్లు

GDWL: కార్తీక పౌర్ణమి సందర్భంగా అలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే సరైన బస్సు సౌకర్యం లేక భక్తులు, యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో పలువురు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తూ సామర్థ్యానికి మించి ప్రయాణాలు సాగించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడిపి రవాణా సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.