హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ.. ముగ్గురు మృతి

HYD: నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బాచుపల్లి పీఎస్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ముగ్గురు కార్మికులు మృతి చెందారు. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు లోపలకు దిగినవారు ప్రమాదవశాత్తు ఊపిరాడక అక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.