హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆశావర్కర్ల జీతాలు పెంచుతాం: సీతక్క

MLG: వేతనాలు పెంచి రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ములుగులో మంత్రి సీతక్కకు ఆశా వర్కర్లు మంగళవారం సమ్మె నోటీసు అందజేశారు. డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని తెలిపారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచుతామని భరోసా ఇచ్చినట్లు ఆశా వర్కర్లు తెలిపారు.