SDPT: మానకొండూరు నియోజకవర్గంలోని అలుగునూరులో ఈ నెల 29న దీక్షా దివస్ నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. బెజ్జంకిలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి మాట్లాడుతూ... కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జరిగిన బలిదానాలను స్మరించుకుంటూ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ఈనెల 29న అలుగునూరులో దీక్షా దివస్: బీఆర్ఎస్


