TPT: లడ్డూ పోటు కార్మికుల కోసం నిర్వహించిన రక్తదాన శిబిరంలో మంగళవారం అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొని రక్తదానం చేశారు. పోటు కార్మికులు సైతం స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో పోటు ఏఈవో మునిరత్నం, స్విమ్స్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రక్తదానం చేసిన అదనపు ఈవో


