హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు ఎన్నికల అక్షరాస్యతపై పోటీలు

ASR: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు ఎన్నికల అక్షరాస్యతపై వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందినవారు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారు. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తారని తెలిపారు.