హైదరాబాద్: 28°C
తెలంగాణ

షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం..రూ.5 లక్షల నష్టం

సూర్యపేట: మొగ్గయ్యగూడెం పరిధిలో షార్ట్ సర్క్యూట్‌తో ధరావత్ బాబు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఆటో నడపడానికి వెళ్లిన సమయంలో ఇంట్లో మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు కాలిపోయాయి. సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.