MDK: కౌడిపల్లి మండలం తునికి కూడలి వద్ద 500 బీడబ్ల్యూఎస్సీ మెయిన్ పైపులైన్ పగిలిపోవడంతో కౌడిపల్లి, కొల్చారం, చిలిపిచెడ్ మండలాలకు 2 రోజులు తాగునీటి సరఫరా బంద్ కానుంది. మెదక్-HYD రహదారిపై జరుగుతున్న మరమ్మతు పనులు పూర్తయిన వెంటనే గ్రామాలకు యథావిధిగా నీటిని అందిస్తామని ఏఈఈ విశ్వసాయి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
తెలంగాణ
రెండు రోజులు నీటి సరఫరా నిలిపివేత


