JGL: ఇబ్రహీంపట్నం మండలం గోదుర్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేక పూజలతో పాటు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. జడ్పీటీసీ మాజీ సభ్యురాలు జంగిలి సునీత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ
గోదుర్ ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు


